వడ్డే ఓబన్న తొలి జయంతి 2015

రెడ్డి సామాజిక వర్గం సంపన్న జమీందారు వంశం. అందుకే, పాలేగాడు నరసింహారెడ్డి సమకాలికుడైన బుడ్డా వెంగళ్ రెడ్డి గారు రాయించిన చరిత్ర లో కొన్ని తేదీలు మరియి సంవత్సరాలు వేయించగలిగారు.

కడప కలెక్టర్ రిపోర్ట్స్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డులు మినహా, ఎక్కువ ఆధారాలు లేని ఈ రేనాటి వీర గాధలో పిచ్చకుంట్ల వారి నోటి పాటలే సాక్షాలు.

ఈ విషయాన్ని, సాక్షాత్తు శ్రీ తంగిరాల వేంకటసుబ్బారావు*(ఈ వీరగాధను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి) *గారే మేము కలిసినప్పుడు చెప్పడం జరిగింది.

ఇక సంవత్సరాన్ని ప్రక్కన పెట్టి, జయంతి తేదీకి వస్తే, కుందు తీరాన నొస్సానికి దగ్గర్లో ఉన్న కొలిమిగుండ్ల వడ్డెర్లు 2015 లో జనవరి 11 న 200 వ జయంతి చేసిన తొలిప్రయత్నాన్ని గుర్తిస్తూ జనవరి 11 ని జాతి మొత్తం అంగీకరించడం లో తప్పు లేదని భావిస్తున్నాం సార్🙏

ఉరి తీయ బడ్డా, అప్పటికే ఉనికి చాటుకున్న కులంలో జన్మించారు కాబట్టి, నరసింహా రెడ్డి గారి కొన్ని ఆనవాళ్లయినా చరిత్ర లో పదిలపరిచారు🙏

పోరులో అన్నీ కోల్పోయిన, సంచార జాతి యోధుడు వడ్డే ఓబన్న ఆనవాళ్లను అప్పట్లో గుర్తించే వారు నిజంగా ఉండి ఉంటే, ఈ రోజు సంచార జాతి వడ్డెర్లు ఇంత కష్ట పడవలసిన అవసరం ఉండదు కదా సార్🙏

అందుచేత, చరిత్ర లో చెరిపి వేయబడ్డ సంవత్సరం మరియు తేదీలకోసం ప్రయాస వీడి, మన పెద్దలు 2015 లో జరుపుకున్న జనవరి 11 ను వడ్డే ఓబన్న జయంతి గా గుర్తించి ముందుకు సాగుదాం అని మనవి చేసుకుంటున్నాను🙏

మీ సోదరి,

Dr. చంద్రకళ జెరిపేటి
789 368 2052