ఓబన్న జయంతి వారోత్సవాలు
జనవరి 11:2020: వడ్డేపల్లి నందు ఓబన్న జయంతి సందర్భంగా వేడుకలు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రవీంద్ర గారు ప్రసంగిస్తూ ఓబన్న చేసిన పోరాటాన్ని గురించి వడ్డీపల్లి గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఓబన్న స్వతంత్ర సమర యోధుడిగా పోరాటం చేసి 18 46 వ సంవత్సరంలో మనకు స్వతంత్రం రాక మునుపు స్వతంత్ర పోరాటంలో కీలకపాత్ర వహించారు . ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం అంటే ఆయన చేసిన పోరాటం వల్ల మనం చాలా సంతోషంగా ఉన్నాము అందువల్ల ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా తెలియజేశారు. జయ కుమార్ గారు మాట్లాడుతూ ఓబన్న చేసిన సేవలను క్లిష్టంగా సంక్షిప్తంగా నూ పిల్లలకు గ్రామ ప్రజలకు పెద్దలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓర్సు రాఘవేంద్ర, ఆంజనేయులు, హరినాథ, తిరుమలయ్య, రేపని ప్రభాకర, ఆంజనేయులు, మల్లెల వెంకట రమణ, పశువుల నాగరాజు, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు