🔰నిన్నటి వరకు, కులభవనం విషయంలో, కులానికి తెలియకుండా సీక్రెట్ మీటింగులు పెట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దని సదరు నాయకులకు విజ్ఞప్తి చేస్తూనే వున్నాము. ఎంత మొరపెట్టుకున్నా, ఈ నాయకుల ధోరణిలో, ఎలాంటి మార్పు లేదన్న విషయం ఇప్పుడు అందరికీ అర్ధమయిపోయింది.
🔰 సో నేటి నుండి, సామాన్య వడ్డెర్లుగా మనం కూడా ఒక టీమ్ తయారుచేసుకుని, ఈ భవన నిర్మాణ మరియు నిర్వహణ కమిటీలో స్థానం కోసం ఐకమత్యంగా మరియు ప్రజాస్వామ్య పద్దతిలో ఓ ప్రయత్నం చేద్దామని నిర్ణయించాము.
🔰 ఇందుకోసం ‘వడ్డే ఓబన్న శ్రామిక సదనం’ పేరు తో ఒక టీమ్ స్థాపించి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి, అన్ని సంఘాలు మరియు సామాన్యుల లిఖిత పూర్వక మద్దతు కోసం డిసెంబర్ 5వ తారీఖు లోపు ఒక నిరాడంబర మీటింగ్ హైదరాబాద్ లో జరుపబోతున్నాము.
🔰 ఈ ప్రయత్నం వివరాలను మీ ముందు ఉంచుతూ, ఈ చిన్న వీడియో చేశాను. పూర్తిగా చూసి, మీ విలువైన అభిప్రాయాలను తెలుపడమే కాదు; మీ సపోర్ట్ మరియి మీ సంఘాల సపోర్ట్ ను ఈ ప్రయత్నానికి ఇవ్వండి.
ప్లీజ్ Note: మీ అందరి అభిప్రాయలు మరియు మద్ధతుతోనే ఈ బహిరంగ మీటింగ్ సమయం మరియు ప్రదేశం నిర్ణయించబడుతుంది. డిసెంబర్ 2 లోపు మీరు కాల్ చేస్తే, మనం డిసెంబర్ 10 డెడ్ లైన్ లోపు, మన టీమ్ అభ్యర్ధన ను అధికారులకు సమర్పించవచ్చు. మీ సోదరి, డా. చంద్రకళ జెరిపేటి 7893682052 9550136660 వడ్డెర్ల ST సాధన సమితి www.vsss.info