ST పోరులో వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాల ఆవశ్యకత
మన అందరి కృషితోనే, వడ్డే ఓబన్న కీర్తి ఈ రోజు సమాజం మొత్తం గుర్తించింది. మన సంచార తెగ వీరుడి చరిత్రను మరియు గౌరవాన్ని కాపాడిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా దండాలు🙏 అలాగే, ST పోరు మధ్యలో వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాల ఆవశ్యకత పైన ఉన్న అనుమానాల్ని కూడా నేను ఈ వీడియో ద్వారా నివృత్తి చేసే ప్రయత్నం చేశాను. మీ ఆహ్వానం లేదా ఆదేశం మేరకు, జయంతి ఉత్సవాల్లో నేను కూడా మనస్ఫూర్తిగా పాల్గొనాలనుకుంటున్నాను. అయితే, ఇక్కడ కేవలం ఆరోగ్య సమస్యలే కాదు; నా సాంఘిక సమస్యలు కూడా అడ్డంకులు కావడం నా దౌర్భాగ్యం. ఈ పరిస్థితుల్లో, ఆ కారణాలు కూడా మీతో పంచుకోక తప్పడంలేదు! దయచేసి అన్యదా భావించకండి🙏 ఇవన్నీ ఎలా ఉన్నా, నేను వచ్చినా లేదా రాక పోయినా, వడ్డే ఓబన్న జయంతి మాత్రం, దిగ్విజయంగా జరగాలని నేను కోరుకుంటున్నాను🙏 NOTE: ఓబన్న జయంతి జరుపుకోవడంలో ఎలాంటి సాయం కావాలన్నా ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లేదా నాకు కాల్/మెసేజ్ చేయండి🙏 www.vsss.info/obanna మీ సోదరి, Dr. చంద్రకళ జెరిపేటి వడ్డెర్ల ST సాధన సమితి 789 368 2052