వడ్డెర్ల ఐకాన్ వడ్డే ఓబన్న 2020 జయంతి ఉత్సవాల దృశ్యమాలిక

దేశం కోసం సర్వస్వము కోల్పోయిన వడ్డే ఓబన్నకు, చరిత్ర లో సముచిత స్థానం కల్పించడం లో, సైరా సినిమా పాపులారిటీ కలసిరావడం మన అదృష్టం. అలాగే వడ్డెర్ల సమిష్టి కృషితో 2020 లో బ్యానర్ల తో ప్రారంభం అయిన ఓబన్న జయంతి ఉత్సవాల దృశ్యమాలికను మీ కోసం సమర్పిస్తున్నాను🙏 రాబోతున్న 2021 జనవరి 11 జయంతిని మరింత ఘనంగా జరుపుకుబోతున్నాం🙏ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఓబన్న విగ్రహాల ప్రతిష్ట అంకురార్పణలు లేదా శంకుస్థాపనలు జరగ బోతున్నాయి. జయంతి ఉత్సవాల నిర్వాహణకు, అనుమతులు మీకు ఎలాంటి డాక్యుమెంట్ కావాలన్నా మన వెబ్సైట్ లోని ఈ లింకులో లభిస్తాయి🙏 www.vsss.info/obanna (డౌన్లోడ్ చేసుకోలేని వారు నాకు కాల్/మెసేజ్ చేస్తే కావలసిన వివరాలు పంపిస్తాను) 🙏కుటుంబమే కాదు, చరిత్రలో స్థానాన్నే కోల్పోయిన సాయుధ పోరు సైన్యాధిపతి వడ్డే ఓబన్న, వడ్డెర కులంలో పుట్టడం మనకు గర్వకారణం. ఆయనకు గౌరవం పెంచితే, సమాజంలో మనకూ గౌరవం పెరుగుతుంది. ఈ జయంతి ఉత్సవాల్లో, వడ్డెర్లందలరూ వారసులుగా నివాళులు అర్పించి నాంది పలికితే, సమాజం మొత్తం ఈ స్వతంత్ర సమర వీరుణ్ణి గుర్తించి స్మరించుకోడానికి సులభం అవుతుంది🙏 జై వడ్డే ఓబన్న మీ సోదరి, Dr. చంద్రకళ జెరిపేటి వడ్డెర్ల ST సాధన సమితి 789 368 2052