వడ్డె ఓబన్న వీరత్వానికి మరియు చరిత్రకు రుజువులు కావాలంటూ, వడ్డెర్లే నాకు కాల్ చేయడం నన్ను బాధించింది!
ఈ విషయమై నా భర్త Dr. ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు గారు, కడప లోని జిల్లా గ్రంధాలయం మరియు బ్రౌన్ గ్రంధాలయాలు సందర్శించి, రేనాటి నొస్సం వీరగాధ పై రీసెర్చ్ చేసి రాసిన ముఖ్య గ్రంధం, ‘రేనాటి సూర్యచంద్రులు’ లోని ముఖ్య అంశాలు పంపారు. ఈ పుస్తకం వివరాలు మాత్రమే పోస్టు చేస్తున్నాను! ఇంకా పేజీలు కావాలంటే నాకు మెసేజ్ చేయగలరు
సైరా సినిమా కథ మరియు స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు అసలు ఈ పుస్తకం చదివారా అన్న అనుమానం తో ఈ క్రింది పాయింట్లు రాస్తున్నాను!(చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు)
*1. నరసింహారెడ్డికి వెంకన్న గురువన్నది ఎంత సత్యమో, వడ్డె ఓబన్న, రెడ్డి గారు నమ్మిన బంటన్నది కూడా అంతే సత్యం! ఈ విషయం స్థానికులే కాదు, రీసెర్చ్ చేసిన స్కాలర్స్ కూడా బల్ల గుద్ది మరీ చెప్పారు! మరి ఈ విషయాన్ని, 2018 వరకు కూడా ఒప్పుకునట్లు పబ్లిసిటీ చేసిన ‘సైరా’ సినిమా రచయితలు, 2019 లో, వడ్డె ఓబన్న పాత్రను ఎందుకు తీసేసారు?*
*2. కన్నడ కిచ్చా సుదీప్ పోషించిన అవుకు రాజు పాత్ర కూడా, పుస్తకంలో అంతగా ప్రాముఖ్యత లేని సాటి జమీందారు పాత్రే! ఈ పాత్రకు కూడా అంత ప్రాముఖ్యతనిచ్చిన చిత్ర రచయితలు, వడ్డె ఓబన్న పాత్రను, సడెన్ గా ఎందుకు తీసేశారు?వడ్డెర్లకు అంత చైతన్యం లేదు, ఏం ప్రశ్నిస్తారులే నుకున్నారా?*
*3. పుస్తకమంతా ఎన్ని సార్లు గాలించినా, (2018 వరకు వడ్డె ఓబన్న పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తాడాని చెప్పారు) ఇప్పుడు విజయ్ సేతుపతి పోషిస్తున్న రాజా పాండి పాత్ర ఎక్కడా ప్రస్తావన లేదు! తమిళనాడు మార్కెట్ కోసం, వడ్డె ఓబన్న పాత్రను తీసేసి, ఈ కధలో ఎక్కడా లేని పాత్రను సినిమాలో ఇరికించారంటే, వడ్డె ఓబన్న వీరత్వాన్ని ప్రశ్నించే వడ్డెర్లే లేరనుకున్నారా?*
*4. సినిమా అనుకరణ స్వేచ్ఛ పేరుతో, సమకాలీన ఝాన్సీ లక్ష్మీ భాయి(అనుష్క షెట్టి) పాత్రను కూడా, ప్రేరేపణ పాత్రగా చూపించిన పరుచూరి మరియ సురేందర్ రెడ్డి గార్లు, ఈ కధలో కీలక పాత్రథారైన వడ్డె ఓబన్న పాత్రను ఎందుకు విస్మరించారు?*
ఇవన్నీ కేవలం నా ప్రశ్నలు కాదు! యావత్ వడ్డెర్ల ప్రశ్నలు కూడా! అక్టోబరు 2 లోపు, ఈ తప్పులు సరిదిద్దుకుని, వడ్డె ఓబన్న పాత్రకు సినిమాలో సముచిత స్థానం కల్పించక పోతే, ఈ సినిమా తీసినోళ్లు చారిత్రక తప్పిదం చేసినట్లే!
జై వడ్డె ఓబన్న! జై వడ్డెర!
మీ సోదరి,
Dr. చంద్రకళ జేరిపేటి
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి
www(dot)vsss(dot)info